చెత్త తీయకుండానే డ్రైనేజీ పనులు

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల శ్రీ వెంకటేశ్వర కాలనీ 4వ వార్డులో 12 అడుగుల నాలాపై స్లాబ్ నిర్మాణం చేపడుతున్నారని స్థానిక నాయకుడు పెద్ది వెంకటేష్ ఆరోపించారు. నాలాలో పేరుకుపోయిన మట్టి, చెత్త, రాళ్లను తొలగించకుండానే స్లాబ్ వేయడం సరికాదన్నారు. ఇలా చేస్తే భవిష్యత్తులో నాలా జామ్ అయి మురుగునీరు కాలనీ రోడ్లు, ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. నల్లకుంట నుంచి వస్తున్న నాలా వద్ద పనులు చేపట్టే ముందు చెత్తను పూర్తిగా తొలగించాలని కోరారు.




