చిన్నప్పటి ప్రేమ.. టీనేజ్లో డిప్రెషన్ ముప్పు తగ్గే ఛాన్స్!

పిల్లలను చిన్నప్పటి నుంచి ప్రేమగా పెంచితే వారి మెంటల్ హెల్త్కి మేలు జరగొచ్చని అధ్యయనం తెలిపింది. అమెరికాలోని నోట్రే డామ్ యూనివర్సిటీ రీసెర్చర్స్ 465 మంది పిల్లలు, వారి తల్లిదండ్రులపై 15 ఏళ్ల పాటు స్టడీ చేశారు. మూడేళ్ల వయసులో ప్రేమ, ప్రోత్సాహం పొందిన పిల్లల్లో టీనేజ్లో సంతోషకరమైన విషయాలకు మెదడు మెరుగ్గా స్పందిస్తున్నట్లు గుర్తించారు. ఇది డిప్రెషన్ ముప్పు తక్కువగా ఉండటంతో సంబంధం కలిగి ఉందని తెలిపారు. అయితే, ఇది కారణాన్ని నిరూపించలేదు.


