పోస్టుల భర్తీలో అవకతవకలు.. ఒక్కో పోస్టుకు రూ.2 లక్షలు?

ములుగు జిల్లా అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో CRT పోస్టుల భర్తీ ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు కోగిల మహేష్ కోరారు. టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీలో అవకతవకలు జరుగుతున్నాయంటూ నిరుద్యోగుల నుంచి ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. ఈ అంశంపై DEO సిద్ధార్థరెడ్డిని కలిసి వివరాలు కోరినట్లు చెప్పారు. ఒక్కో పోస్టుకు రూ.2 లక్షలు తీసుకుని పరీక్షలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని, డబ్బులు చెల్లించిన వారికి ముందుగానే పరీక్ష పేపర్ అందినట్లు సమాచారం ఉందన్నారు.



