← Back to news

డీజేలు, లౌడ్‌స్పీకర్లపై పోలీసుల అవగాహన సదస్సు

By DK· 1h ago
డీజేలు, లౌడ్‌స్పీకర్లపై పోలీసుల అవగాహన సదస్సు

రాత్రి 10 గంటల తర్వాత డీజేలు, లౌడ్‌స్పీకర్లు వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. రాబోయే పండుగలు, మతపరమైన కార్యక్రమాలు, విగ్రహ నిమజ్జనాల నేపథ్యంలో ఏలూరు జిల్లా కుక్కునూరులో డీజే నిర్వాహకులు, ఆపరేటర్లకు పోలీసులు అవగాహన సమావేశం నిర్వహించారు. శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలు, రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు శబ్ద పరికరాల వినియోగంపై ఉన్న ఆంక్షలను వివరించారు. సైలెన్స్ జోన్‌లలో నిబంధనలు పాటించాలని, ఊరేగింపులు, నిమజ్జనాల సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకూడదని సూచించారు.

More in Local