యాక్టర్ నుంచి CM వరకు.. గణపయ్యలో విజయ్
దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. చెన్నైలోని కొడుంగైయూర్ RK నగర్‌లో తమిళ TVK పార్టీ అధినేత విజయ్.. సినీ, రాజకీయ ప్రయాణాన్ని సూచించే ప్రత్యేక గణేశ విగ్రహాలు ఆకర్షిస్తున్నాయి. 3 దశలుగా, ‘గిల్లీ’ సినిమా కబడ్డీ ప్లేయర్ లుక్, వైట్ షర్ట్-ఖాకీ ప్యాంటు-TVK కండువాతో పొలిటికల్ ఎంట్రీ, బ్లాక్ కోట్-లూయి విట్టన్ బెల్ట్‌తో సీఎం గెటప్. ఈ న్యూ విగ్రహాలను చూసేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివస్తూ ఫొటోలు తీసుకుంటున్నారు. ఇవి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
