HDFC బ్యాంక్ కొత్త CEO

HDFC బ్యాంక్ కొత్త MD, CEOగా అనుప్ బాగ్చీ నియమితులయ్యారు. RBI ఆయన నియామకానికి నిన్న ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ MD, CEOగా ఉన్న బాగ్చీ అక్టోబర్ 27 నుంచి HDFC బ్యాంక్ బాధ్యతలు చేపడతారు. ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుత MD, CEO శశిధర్ జగదీశన్ పదవీకాలం అక్టోబర్ 26తో ముగియనుంది. బాగ్చీకి ఈ రోజు నుంచి అదనపు డైరెక్టర్ బాధ్యతలు కూడా అప్పగించారు.