ఢిల్లీలో ఎన్నికల సంఘంపై వెరైటీ నిరసన
గాంధీ జయంతి రోజున ఢిల్లీలో ఎన్నికల సంఘంపై యూత్ కాంగ్రెస్ వెరైటీ నిరసన చేశారు. CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. కొందరు తెల్లటి చాదర్లు కప్పుకుని భూతాల్లా, మరికొందరు స్కెలిటన్ మాస్కులతో రోడ్లపైకి వచ్చారు.<br>SIR, ఓటర్ లిస్ట్‌లో పేర్ల తొలగింపుపై ప్రశ్నలు లేవనెత్తుతూ నినాదాలు చేశారు. కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జంతర్ మంతర్ దగ్గర కూడా నిరసనలు జరగడంతో పోలీసులు ఆంక్షలు విధించారు.

