← Back to news

నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

By nagaraju· 1d ago· Choutuppal (Ct), Choutuppal, Yadadri Bhuvanagiri
నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరగాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ అధికారులను ఆదేశించారు. డివిజన్ పరిధిలోని సంగెం, తుమ్మలగూడెం, రామన్నపేట, వలిగొండ చెరువుల వద్ద ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా లైటింగ్, క్రేన్లు, బారికేడింగ్ ఏర్పాటు చేయాలని, పటిష్ఠ బందోబస్తు కల్పించాలని సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనం సాఫీగా జరిగేలా చూడాలని తెలిపారు. ఈ పర్యటనలో డీఎస్పీ మధుసూదన్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ
నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

More in Local