హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య ఇక ASI

జగిత్యాల జిల్లా ధర్మపురి పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకటయ్య ఏఎస్ఐగా పదోన్నతి పొందారు. ఆయన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌ను కలిశారు. ఎస్పీ ఆయనకు ఏఎస్ఐ స్టార్ చిహ్నాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.



