← Back to news

తెలుగులో మాట్లాడిన సీఎం విజయ్!

By Mahesh· 2h ago· Vijayawada

AP: విజయవాడ పున్నమి ఘాట్‌లో జరిగిన విజయవాడ ఉత్సవ్ సీజన్‌-2 కార్యక్రమానికి CM చంద్రబాబు. తమిళనాడు CM విజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించి అందరినీ ఆకట్టుకున్నారు. ‘అందరికీ నమస్కారం’ అంటూ పలకరించిన ఆయన, నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టమని అన్నారు. విజయవాడకు రావడం, ప్రజలను కలవడం సంతోషంగా ఉందని తెలిపారు. తనపై అభిమానం చూపించిన ప్రజలకు, నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. ఇద్దరు CMలు ఒకే వేదికపై కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

More in AP