చెన్నై తాగునీటి అవసరాలపై చంద్రబాబు, విజయ్ భేటీ
AP: తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో గోదావరి-కావేరి నదుల అనుసంధానంతో పాటు చెన్నై తాగునీటి అవసరాలపై వాళ్లు చర్చించారు. చెన్నై నగరానికి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 4.08 టీఎంసీల నీటిని విడుదల చేసిందని, భవిష్యత్తులో నీటి లభ్యతను బట్టి అదనంగా నీటిని విడుదల చేసే అంశాన్ని పరిశీలిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.


