← Back to news

ఆ బాలుడి పరిస్థితిపై లోకేశ్‌ స్పందన

By Lokesh· 2h ago
ఆ బాలుడి పరిస్థితిపై లోకేశ్‌ స్పందన

AP: నెల్లూరు జిల్లాలో 8 ఏళ్ల పిల్లాడు గొర్రెలు కాస్తూ, తనకు సరైన ఆహారం అందడం లేదనీ, ఇంటికి తీసుకెళ్లాలని ఏడుస్తూ కనిపించిన వీడియోపై మంత్రి నారా లోకేశ్‌ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా బాధ కలిగించిందని తెలిపారు. బాలుడి పరిస్థితిని వెంటనే పరిశీలించి, అతను సురక్షితంగా ఉండేలా చూడాలని నెల్లూరు జిల్లా కలెక్టర్‌ను కోరారు. బాలుడికి అవసరమైన రక్షణ, సహాయం అందించాలని సూచించారు.

More in AP