AP ప్రభుత్వానికి హైకోర్టు షాక్

AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో BCలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ AP ప్రభుత్వం జారీచేసిన జీవో 105, 1065లను హైకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతం పరిమితిని దాటి రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు తెలిపింది. 6 వారాల్లో ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించింది. ఈ తీర్పు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. ఐతే.. హైకోర్టు ఒప్పుకోదని AP ప్రభుత్వానికి తెలియదా? ఎలాగూ కొట్టేస్తారనే ఉద్దేశంతోనే ఈ జీవోలు ఇచ్చిందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.



