AE లేక ఇబ్బందుల్లో నవాబ్‌పేట పంచాయతీలు

నవాబ్‌పేట మండలంలో పంచాయతీరాజ్ AE పోస్టు ఆరు నెలలుగా ఖాళీగా ఉండటంతో అభివృద్ధి పనులు అన్నీ ఆగిపోయాయి. AE లేకపోవడం వల్ల పనుల అంచనాలు వేయడం, బిల్లులు క్లియర్ చేయడం ఆలస్యమవుతోందని సర్పంచులు ఆందోళన చెందుతున్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి పనులు పూర్తయినా బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే AE నియామకం చేపట్టాలని కలెక్టర్‌కు తెలిపారు. దీనిపై స్పందించిన MPDO జయరామ్ నాయక్ సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.



