ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలి: వెంకట వీరయ్య

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ MLA సండ్ర వెంకట వీరయ్య పాల్గొని మాట్లాడారు. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.



