ప్రజా సమస్యలకు పరిష్కారం.. క్లియర్ కట్ న్యూస్ కథనం ప్రభావం!

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మాపూర్–కర్కపట్ల రోడ్డులో ఎల్లమ్మ గుడి సమీపంలో మురుగునీరు, చెత్త పేరుకుపోయిందని క్లియర్ కట్ న్యూస్ కథనం ప్రచురించింది. దీనిపై మున్సిపల్ యంత్రాంగం వెంటనే స్పందించింది. దసరా పండుగ సందర్భంగా పారిశుద్ధ్య పనులు చేపట్టి ప్రాంతాన్ని శుభ్రం చేసింది. మున్సిపల్ చైర్మన్ జాం రవి, కమిషనర్ వెంకట గోపాల్, శానిటరీ సూపర్వైజర్ దుర్గేష్, సిబ్బందికి ప్రజలు థాంక్స్ చెప్పారు.


