← Back to news

చివ్వెంలలో తాగు, సాగునీటి కొరత

By Bala· 1d ago
చివ్వెంలలో తాగు, సాగునీటి కొరత

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో వర్షాభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు నెలలుగా వానలు లేక చెరువులు, కుంటలు, బోర్లు ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో తాగు, సాగునీటి కొరత ఏర్పడింది. జూలై వర్షాలను నమ్ముకుని సాగు చేసిన పత్తి, పెసర, కంది పంటలు ఎండిపోతున్నాయి. బోర్ల కింద వరి సాగు చేస్తున్న రైతులు విద్యుత్ సరఫరా సమస్యలతో సతమతమవుతున్నారు.

More in Local