వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో వీఆర్ఏలు చేస్తున్న సమ్మె ఆరో రోజుకు చేరింది. తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు సమ్మె కొనసాగిస్తూ తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ ఉద్యమం కొనసాగుతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం తరహాలో వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, అర్హులైన వీఆర్ఏలకు వీఆర్వోలు, అటెండర్లు, వాచ్‌మెన్లు, రికార్డు అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు.



