← Back to news

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్

By KUCHIPUDI BUJJIBABU· 1d ago· Salivahanapeta, Mangalagiri, Guntur
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్

గుంటూరు జిల్లా మంగళగిరిలోని గండాలయ్యపేట ప్రజల సమస్యల పరిష్కారానికి మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆయన సూచనల మేరకు తహసీల్దార్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. కొత్త ఆధార్ నమోదు, ఆధార్ వివరాల మార్పులు, బయోమెట్రిక్ అప్‌డేట్, ఈ-కేవైసీ సమస్యల పరిష్కారంతోపాటు రేషన్ కార్డులు, కుల ధ్రువీకరణ పత్రాల జారీకి చర్యలు చేపట్టారు. వివిధ కార్యాలయాల చుట్టూ తిరగకుండా స్థానికంగానే సేవలు అందడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

More in Local