← Back to news

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన

By DK· 2h ago
ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని చిన్న చింతకుంట, జక్కపల్లి గ్రామాల రైతులకు లింగాపూర్ రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయంపై ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ విధానాలు, వివిధ కిట్ల వినియోగం, నేల ఆరోగ్య పరిరక్షణ, తక్కువ పెట్టుబడితో సాగు వంటి అంశాలపై శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు వివరించారు. రైతులకు ప్రకృతి వ్యవసాయ కిట్లను పంపిణీ చేసి వాటి వినియోగ విధానాన్ని తెలిపారు.

More in Local