← Back to news

పిల్లలతో భిక్షాటన చేయిస్తే చర్యలు తప్పవు!

By KUCHIPUDI BUJJIBABU· 1d ago· Baptist Pet, Mangalagiri, Guntur
పిల్లలతో భిక్షాటన చేయిస్తే చర్యలు తప్పవు!

మంగళగిరిలో బాలల భిక్షాటన నిర్మూలనకు బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్‌లైన్, షారోన్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాయి. భిక్షాటన చేస్తున్న పిల్లలు, చిన్నారులతో భిక్షాటన చేస్తున్న తల్లులను గుర్తించి విచారించినట్లు అధికారులు తెలిపారు. ధ్రువీకరణ పత్రాల ద్వారా పిల్లలు వారి సొంత బిడ్డలేనని నిర్ధారించారు. బాలలతో భిక్షాటన చేయించడం చట్టరీత్యా నేరమని, పిల్లల విద్య, భద్రతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.

More in Local