← Back to news

ఇప్పటంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

By KUCHIPUDI BUJJIBABU· 7h ago· Guntur

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో ₹.70 లక్షల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రి నారా లోకేష్ సహకారంతో ఈ పనులు చేపడుతున్నట్లు స్థానిక టీడీపీ నాయకులు తెలిపారు. త్వరలో తాగునీటి సరఫరా, పైప్‌లైన్లు, డ్రైనేజీ వ్యవస్థలను మరింత మెరుగుపరచనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నందం అబద్దయ్య, పోతినేని శ్రీనివాసరావు, ముమ్మిడి సత్యనారాయణ, శంకర్‌శెట్టి పిచ్చయ్యతో పాటు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

More in Local