నందిపేటలో మినీ స్టేడియం స్థల పరిశీలన

నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో మినీ స్టేడియం మంజూరైంది. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి సోమవారం అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. స్టేడియానికి అవసరమైన విస్తీర్ణం, మౌలిక వసతులు, భవిష్యత్ అవసరాలపై చర్చించారు. క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన అన్నారు. స్టేడియం అందుబాటులోకి వస్తే నందిపేట, పరిసర గ్రామాల యువతకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రం లింగం తదితరులు పాల్గొన్నారు.





