కార్మిక చట్టాల ఉల్లంఘనలపై ఫిర్యాదు

కార్మిక చట్టాల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామంలోని Amspro Lifesciences Pvt Ltd. (Sy.No.631/A1) కంపెనీపై సామాజిక కార్యకర్త కోస్గీ వెంకటయ్య జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సంస్థలో గత 4–5 నెలలుగా సుమారు 150 మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. వారికి ESI, EPF వంటి సౌకర్యాలు కల్పించకుండా విధులు నిర్వహింపజేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.



