← Back to news

చౌటుప్పల్‌ వద్ద భారీ ట్రాఫిక్ జామ్

By Bala· 9 Oct 2026

TG: యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌ వద్ద NH-65పై భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లే మార్గంలో లక్కారం నుంచి కొయ్యలగూడెం వరకు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. రహదారి మరమ్మతులు, వన్‌వేలో వాహనాల రాకపోకల కారణంగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

More in TG