హైదరాబాద్‌లో కొత్త బోర్లకు నో పర్మిషన్

TG: ఎల్‌నినో కారణంగా తెలంగాణ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది. హైదరాబాద్‌లో ప్రస్తుతానికి కొత్త బోర్లు వేసేందుకు పర్మిషన్ లేదని ప్రకటించింది. నిర్మాణాల కోసం కొత్త బోర్లు వేయడానికి ప్రస్తుతం అనుమతులు ఇవ్వకూడదని ఛీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు ఆదేశించారు. • నవంబర్ 1 నుంచి నిర్మాణ పనులకు గ్రీన్ ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తారు. నల్లాలకు మోటార్లు పెట్టకుండా అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు.

