స్కూళ్ల చుట్టూ జంక్ ఫుడ్..!

TG: హైదరాబాద్‌లో స్కూళ్ల చుట్టూ జంక్‌ఫుడ్ అమ్మకాలు పెరుగుతున్నాయి. FSSAI రూల్స్ ప్రకారం స్కూల్ గేటు నుంచి 50 మీటర్ల పరిధిలో చిప్స్, ప్యాకెట్ స్నాక్స్, స్వీట్ డ్రింక్స్ వంటి అధిక ఉప్పు, చక్కెర, కొవ్వు ఉన్న వాటిని అమ్మకూడదు. కానీ రూల్స్ సరిగ్గా అమలవ్వట్లేదు. ప్యాకెట్, ప్రాసెస్డ్ ఫుడ్ అధికంగా, ఈజీగా లభిస్తున్నాయి. వాటికి తోడు స్క్రీన్ టైమ్ పెరగడం, ఆటలు తగ్గడం వల్ల పిల్లల్లో ఓవర్‌వెయిట్, టైప్-2 డయాబెటిస్ ముప్పు పెరుగుతోందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.



