← Back to news

రోజుకో అలంకారం.. 11 నుంచి ఉత్సవాలు

By Prashanth· 3 Oct 2026
రోజుకో అలంకారం.. 11 నుంచి ఉత్సవాలు

AP: విజయవాడ దుర్గామల్లేశ్వర ఆలయంలో ఈ నెల 11 నుంచి 20 వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు రోజుకో అలంకారంలో దర్శనమివ్వనున్నారు. 11న బాలాత్రిపురసుందరీ, 12న గాయత్రీదేవి, 13న అన్నపూర్ణ, 14న మహాచండీ, 15న లలితా త్రిపురసుందరీ, 16న సరస్వతి, 17న మహాలక్ష్మి, 18న దుర్గాదేవి, 19న మహిషాసురమర్దిని, 20న రాజరాజేశ్వరి అలంకారాల్లో దర్శనమిస్తారు. 20న సాయంత్రం కృష్ణానదిలో హంసవాహన తెప్పోత్సవం నిర్వహించనున్నారు.

More in AP