← Back to news

జనసేన స్థానిక ఎన్నికల కమిటీ సభ్యుడిగా మహిపాల గణేష్

By ABDULLA· 15h ago· East Godavari
జనసేన స్థానిక ఎన్నికల కమిటీ సభ్యుడిగా మహిపాల గణేష్

తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలానికి చెందిన జనసేన కార్యకర్త మహిపాల వీర వెంకట సత్యనారాయణ (గణేష్)కు జగ్గంపేట నియోజకవర్గ స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ నిర్వాహక దళ సభ్యుడిగా బాధ్యతలు అప్పగించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమ్మకంతో బాధ్యత ఇచ్చిన పవన్ కళ్యాణ్, నియోజకవర్గ ఇన్‌చార్జి తుమ్మలపల్లి రమేష్‌కు గణేష్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.

More in Local