← Back to news

CEC నియామకంపై YS జగన్ ఫైర్

By Krishna· 7h ago

AP: వీలైనంతవరకూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడని YS జగన్.. ఇప్పుడు వాయిస్ మార్చారు. ప్రస్తుతం ఉన్న CEC నియామక ప్రక్రియను తప్పుపట్టారు. ఇదివరకు ఉన్నట్లు CECని ఎన్నుకునే ముగ్గురు సభ్యుల్లో ఒకరు కేంద్రం నుంచి, ఒకరు ప్రతిపక్షం నుంచి, మరొకరు CJI ఉండాలని జగన్ కోరారు. ప్రస్తుత విధానంలో లోపం ఉందన్నారు. అదే తరహా ఎన్నిక విధానం రాష్ట్రాల్లోని SEC నియామకం లోనూ ఉండాలన్నారు. ఈ లోపం సరిచేసే వరకూ వ్యవస్థ బాగుపడదన్న జగన్.. మార్పు వస్తేనే, ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం కలుగుతుందన్నారు.

More in AP