← Back to news

పాఠశాలకు రోడ్డు మార్గం

By Kendyala Balaraju· 23h ago· Penjerla, Kothur, Ranga Reddy
పాఠశాలకు రోడ్డు మార్గం

ఖిల్లా ఘనపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)కి వెళ్లే రహదారి సమస్యకు పరిష్కారం లభించనుంది. గ్రామ సర్పంచ్ ఆగారం పద్మమ్మ ప్రకాష్ చొరవతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇవాళ నాయకులు కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు. రోడ్డు నిర్మాణంతో విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, స్థానికులకు రాకపోకల ఇబ్బందులు తగ్గనున్నాయి. దీంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు.

More in Local