"సీఎం గారూ మా ఇల్లు కూల్చేస్తారా".. యువతి కన్నీళ్లు
TG: తండ్రి లేరు.. తల్లికి మాటలు రావు, బధిరురాలు.. ఆ యువతే ఫ్యామిలీకి దిక్కు. కానీ "ప్రభుత్వం మా ఇంటిని కూల్చేస్తానంటోంది" అని ఆమె కన్నీళ్లు పెడుతోంది. ఖమ్మం లోని శ్రీనివాసనగర్‌లో ఓ బాధితురాలి కథ ఇది. "KCR ప్రభుత్వంలో నీళ్లు ఇచ్చి, రోడ్లు వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇంటిని కూల్చేస్తామంటోంది" అని ఆమె ఏడుస్తోంది. స్థానికులు కూడా ఆ పేద కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ వీడియో చూడండి. మీకు ఏమనిపిస్తోందో.. మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో చెప్పండి.


