ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి అండర్‌ట్రయల్ ఖైదీ ఎస్కేప్!

TG: హైదరాబాద్ ఎర్రగడ్డ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ (IMH) నుంచి ఓ అండర్‌ట్రయల్ ఖైదీ ఎస్కేప్ అయ్యాడు. చంచల్‌గూడ సెంట్రల్ జైలు నుంచి ట్రీట్‌మెంట్ కోసం తీసుకొచ్చిన 22 ఏళ్ల కిషోర్ కుమార్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం హాస్పిటల్ నుంచి పారిపోయాడు. టాయిలెట్‌కు వెళ్లేందుకు పర్మిషన్ తీసుకుని వెంటిలేటర్ ద్వారా బయటకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కేసు ఫైల్ చేసి, అతడి కోసం పోలీసులు సెర్చ్ చేస్తున్నారు.

