కరెంట్ వైర్లతో ప్రమాదం.. ఇల్లు మొత్తం దగ్ధం

వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం రాస్నం గ్రామంలో విద్యుత్ వైర్లు ఒకదానికొకటి తగలడంతో మంటలు చెలరేగి కుమ్మరి బిచ్చమ్మ ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటనలో ఇంట్లోని వస్తువులన్నీ కాలిపోవడంతో తీవ్ర ఆస్తినష్టం జరిగింది. కుమ్మరి వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న బిచ్చమ్మ కుటుంబం ప్రస్తుతం నిరాశ్రయ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రమాదంతో కుటుంబానికి నిలువ నీడ లేకుండా పోయింది. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని బిచ్చమ్మ కోరారు.


