← Back to news

ZP పీఠంపై TDPలో ఉత్కంఠ

By Rajiv Raju· 6h ago· ఎన్టీఆర్
ZP పీఠంపై TDPలో ఉత్కంఠ

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ZP ఛైర్మన్ పదవిపై TDPలో ఆశావహుల ప్రయత్నాలు మొదలయ్యాయి. 2005 నుంచి పార్టీకి సేవలందిస్తున్న సీనియర్ నాయకుడు, AP మాదిగ SC ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియయ్య.. MLA కొలికపూడి శ్రీనివాసరావును కలిసి తనకు అవకాశం కల్పించాలని కోరారు. ఇదే పదవి కోసం మరికొందరు నేతలు కూడా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. దీంతో ZP ఛైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

More in Local