← Back to news

కళాకారులకు మరిన్ని మార్కెటింగ్ అవకాశాలు

By DK· 8h ago
కళాకారులకు మరిన్ని మార్కెటింగ్ అవకాశాలు

నిర్మల్ కొయ్య బొమ్మల కళను పరిరక్షించడంతో పాటు కళాకారులకు మరిన్ని మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. నిర్మల్ పట్టణంలోని కొయ్య బొమ్మల ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు. బొమ్మల తయారీ విధానం, చరిత్ర, మార్కెటింగ్, కళాకారుల పరిస్థితి, పొనికి కర్ర లభ్యతపై నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బొమ్మల తయారీకి అవసరమైన పొనికి చెట్ల పెంపకానికి చర్యలు చేపడతామని చెప్పారు.

More in Local