← Back to news

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన

By rajinikanth nagilla· 1d ago· Hanumakonda
ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన

TG: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి ఏఈఓ క్రిసోలైట్‌ మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. రైతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగించే కషాయాలు, బీజామృతం, జీవామృతం, ఘనజీవామృతం, బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం, దశపర్ణి తయారీ విధానాలపై రైతులకు వీడియోల ద్వారా అవగాహన కల్పించారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 4h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.