దసరాకి ప్రత్యేక రైలు సర్వీసులు

దసరా, బతుకమ్మ పండుగల వేళ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. అక్టోబర్ 9 నుంచి 25 వరకు ప్రత్యేక రైళ్లు నడపనుంది. ట్రైన్ 07711 మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకి సికింద్రాబాద్లో బయలుదేరి సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకి సిర్పూర్ కాగజ్నగర్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 07712 సాయంత్రం 6కి బయలుదేరి రాత్రి 11 గంటల 15 నిమిషాలకి హైదరాబాద్ చేరుతుంది. చర్లపల్లి, భువనగిరి, జనగామ, కాజీపేట సహా కొన్ని స్టేషన్లలో ఆగే ఈ రైళ్లలో AC Chair Car, Second Sitting కోచ్లు ఉంటాయి.



