లాలూ బంగ్లాకు కర్రలతో కాపలా

RJD అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, మాజీ సీఎం రబ్రీ దేవి దంపతులకు కేంద్రం Z+ కేటగిరీ భద్రతను ఉపసంహరించుకోవడం బీహార్ పాలిటిక్స్ లో కలకలం రేపుతోంది. కేంద్రం డెసిషన్ ని వ్యతిరేకిస్తూ RJD కార్యకర్తలు తమ ప్రతాపం చూపిస్తామని ముందుకొచ్చారు. తమ నేతకు తామే రక్షణగా ఉంటామని వందలాది మంది కార్యకర్తలు చేతుల్లో లాఠీలు, కర్రలతో లాలూ బంగ్లా బయట డే అండ్ నైట్ కాపలా కాస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేంద్రం భద్రతను తగ్గించిందని ఆరోపించారు. తమ నాయకుడి ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లినా మోదీ సర్కార్ దే బాధ్యతని ఆర్జేడీ కార్యకర్తలు హెచ్చరించారు.


