కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలి

కార్మికులకు నెలకు రూ.26 వేల కనీస వేతనం, 55 ఏళ్లు దాటిన వారికి రూ.5 వేల పింఛన్ ఇవ్వాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్ మండలం గోవిందపురంలో జరిగిన పట్టణ భవన నిర్మాణ కార్మిక సంఘం కౌన్సిల్ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు జడ శ్రీనివాస్ మాట్లాడారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని కోరారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.



