ఈమెయిల్‌తో మోసం!

TG: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఓ కంపెనీని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. ఆ కంపెనీకి వస్తువులు అందించే సంస్థ ఈమెయిల్‌ను హ్యాక్ చేసి, బ్యాంకు ఖాతా మారిందంటూ నకిలీ వివరాలతో మెయిల్ పంపారు. దీన్ని నిజమని నమ్మిన కంపెనీ సిబ్బంది ఈ నెల 5న రెండు విడతల్లో 35.52 లక్షలు బదిలీ చేశారు. ఈ నెల 6న అసలు సంస్థను సంప్రదించగా డబ్బులు అందలేదని తెలిసింది. దీంతో మోసపోయినట్లు గుర్తించి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశారు.



