← Back to news

కామారెడ్డిలో అంబేద్కర్ భవన్.. బోర్డు పెట్టేశారు!

By Ravi· 12h ago· Kamareddy, Kamareddy, Kamareddy
కామారెడ్డిలో అంబేద్కర్ భవన్.. బోర్డు పెట్టేశారు!

కామారెడ్డి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవనం కోసం సైట్ ఫిక్స్ అయింది. రెండు ఎకరాల స్థలంలో బోర్డు పెట్టే ఈవెంట్ జరిగింది. జిల్లా DSDO వెంకటేశ్వర్, అంబేద్కర్ యువజన సంఘం నేతలు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు కోత్తోల్ల గంగారాం, సెక్రెటరీ గైని రాజు హాజరయ్యారు. గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి మల్లన్న, నీరడి సంగమేశ్వర్, ధ్యామని భూపతి, లేగ్గల రాజు, గడ్డం రవి పాల్గొన్నారు. భవన నిర్మాణానికి ఇది మొదటి అడుగని, శరవేగంగా అంబేద్కర్ భవన నిర్మాణం పూర్తవుతుందని నేతలు చెబుతున్నారు.

కామారెడ్డిలో అంబేద్కర్ భవన్.. బోర్డు పెట్టేశారు!

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 39m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.