సియాకి ఇవాళ MRI, X-ray టెస్టులు

గురుగ్రామ్, గోల్ఫ్ కోర్స్ రోడ్‌లో సెప్టెంబర్ 14న జరిగిన హిట్ అండ్ రన్ కేసులో గాయపడిన మహిళా బైకర్ సియా ఇవాళ ఢిల్లీ హాస్పిటల్‌లో ఎక్స్-రేలు, MRI స్కాన్లు, ఇతర ట్రీట్‌మెంట్లు చేయించుకోనున్నారు. ఆమె తీవ్రమైన నొప్పితో ఉన్నారనీ, బయటకు కనిపించని గాయాలు ఉన్నాయని ఆమె తండ్రి చెప్పారు. ప్రమాదం వల్ల కలిగిన నొప్పి కొనసాగుతుండటంతో.. ఈ మెడికల్ టెస్టులు అవసరమయ్యాయి. ఈ కేసులో హిట్ అండ్ రన్ చేసిన కల్యాణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.


