ప్రభుత్వ భూములు కాపాడాలి: బీఎస్పీ

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల కేంద్రంలో గ్రీవెన్స్ నిర్వహించారు. కాకరవాయి గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూములను కాపాడాలని బిఎస్పీ ఫిర్యాదు చేసింది. అయిలమ్మ సెంటర్, ముత్యాలమ్మ సెంటర్, సూర్యాపేట రోడ్డు, స్మశానవాటిక పరిసరాల్లో విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని, అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. కార్యక్రమంలో నల్లగట్టు శంకర్ మహరాజ్, ఎన్నబోయిన రమేష్ యాదవ్, కొమ్ము పూలే, చేవగాని మధుగౌడ్, నల్లగట్టు నగేష్ తదితరులు పాల్గొన్నారు.



