బస్సును అడ్డుకున్న స్టూడెంట్
కర్ణాటకలోని కొప్పళ తాలూకా బి.హోసహళ్లి బస్టాప్ వద్ద ఓ స్టూడెంట్ RTC బస్సును అడ్డుకున్న వీడియో వైరల్ అయింది. హట్టి-ముండర్గి నుంచి కొప్పళ వెళ్తున్న KSRTC బస్సు స్టూడెంట్స్ కోసం ఆపలేదని ఆరోపించింది. ఎగ్జామ్‌కు లేటవుతుందని, బస్సు ఆపకపోతే ఎగ్జామ్‌కు ఎలా వెళ్లాలని డ్రైవర్, కండక్టర్‌ను ప్రశ్నించింది. గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు నిర్ణీత స్టాప్‌ల వద్ద ఆగడం లేదని స్థానికులు ఆరోపించారు. స్టూడెంట్స్ ఇబ్బందులు తీర్చేందుకు స్కూల్స్ , కాలేజ్ టైంలో బస్సు సర్వీసులు పెంచాలని కోరారు.

