← Back to news

హాస్టళ్లలో పర్యవేక్షణ కట్టుదిట్టం చేయాలి

By Ramesh Ch· 12h ago· Narsampet (Ct), Narsampet, Warangal
హాస్టళ్లలో పర్యవేక్షణ కట్టుదిట్టం చేయాలి

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని పలు ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వార్డెన్లు క్రమం తప్పకుండా హాస్టళ్లకు వచ్చి విద్యార్థుల పరిస్థితిని పర్యవేక్షించడం లేదని వారు చెబుతున్నారు. దీంతో రాత్రివేళల్లో విద్యార్థులు హాస్టళ్ల నుంచి బయటకు వెళ్తున్నారని తల్లిదండ్రులు పేర్కొన్నారు. హాస్టళ్లలో వార్డెన్ల పర్యవేక్షణను కట్టుదిట్టం చేయడంతో పాటు అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని కోరుతున్నారు.

More in Local