← Back to news

ఆలయ భూములను పరిరక్షించాలి

By DK· 18h ago
ఆలయ భూములను పరిరక్షించాలి

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవలంపేటలో శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయానికి సంబంధించిన భూములను పరిరక్షించాలని హిందూ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు రామమూర్తి కోరారు. చిత్తూరు ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆలయ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని ఆరోపించారు. దేవలంపేటలో సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం చెరువును ఆనుకుని స్వామివారి ఆలయం నిర్మించినట్లు తెలిపారు. ఆలయానికి తూర్పున ఉన్న స్థలంలో కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు.

More in Local