← Back to news

ప్రజావాణి ఫిర్యాదులపై అధికారుల నిర్లక్ష్యం

By Narsimulu· 1d ago· Doma, Doma, Vikarabad
ప్రజావాణి ఫిర్యాదులపై అధికారుల నిర్లక్ష్యం

వికారాబాద్ జిల్లాలో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. కానీ అధికారులు వాటిని పట్టించుకోవడం లేదని ఫిర్యాదుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల సమస్య, అధికారుల అక్రమాలపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసి మూడు నెలలైనా పరిష్కారం లేదని చెబుతున్నారు. నిర్లక్ష్యపు సమాధానాలే వస్తున్నాయని, దీంతో ప్రజావాణిపై నమ్మకం పోతోందని వాపోతున్నారు. ఈ అంశంపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరుతున్నారు.

ప్రజావాణి ఫిర్యాదులపై అధికారుల నిర్లక్ష్యం

More in Local