విద్యుత్ షాక్ తో రైతు బలి

మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలం నేకునాంబాద్ గ్రామంలో విషాద ఘటన జరిగింది. పంట పొలాల్లో పనుల నిమిత్తం ఉదయం వెళ్లిన తిప్పిశెట్టి రాధామోహన్ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. విద్యుత్ వైర్లు తెగి ఫెన్సింగు మీద పడడంతో, దానిని తెలియక ముట్టుకున్న రాధామోహన్ అక్కడికక్కడే షాక్ కొట్టి మరణించారు. మొత్తం లైను ఫీజులు ఆపి చెక్ చేస్తే గానీ ఈ విషయం బయటపడలేదు.. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.



