సేవా సంకల్ప్.. విద్యార్థుల ప్రతిభా పోటీలు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు ఉన్నత పాఠశాలలో సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా విద్యార్థులకు వక్తృత్వ, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చాటారు. విజేతలు అక్టోబర్ 1న నెల్లూరులో జరిగే జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఎంఈఓ-2 ధనలక్ష్మి తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు పద్మలత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


